పెళ్లై నెల కాకముందే.. | Woman Suicide In Kadapa | Sakshi
Sakshi News home page

పెళ్లై నెల కాకముందే..

Published Thu, Jul 4 2019 6:59 AM | Last Updated on Thu, Jul 4 2019 7:01 AM

Woman Suicide In Kadapa - Sakshi


సాక్షి, ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొత్తమాధవరంలో బుధవారం యువరాణి (19) అనే నూతన వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒంటిమిట్ట పోలీసు స్టేషన్‌ రైటర్‌ ముజీర్‌ తెలిపిన వివరాల మేరకు.. గతనెల 9వ తేదీన ఈమెకు సిద్దవటం మండలం గొల్లపల్లెకు చెందిన  మేనేమామ గుర్రయ్యతో వివాహమైంది. మూడు రోజుల క్రితం ఆమె కొత్తమాధవరంలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. బుధవారం తల్లిదండ్రులు పనిమీద కడపకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఆమె ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుంది. కాళ్లపారాణి ఆరకనే తమ బిడ్డ దూరమైందని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఎస్‌ఐ అశ్విని మృతదేహాన్ని పీఎం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

పెళ్లై నెల కాకముందే ఏం జరిగింది ?
పెళ్లి అయ్యి సరిగ్గా నెల కూడా కాలేదు..  యువరాణి ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. భర్త మాత్రం మా మధ్య ఎటువంటి సమస్యలు లేవంటున్నారు. యువరాణి తల్లిదండ్రులు తమ కుమార్తె చాలా మంచిదని చెబుతున్నారు.  అంత్తింట్లో, పుట్టింట్లో ఏ సమస్యలు లేకున్నా ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుదో అర్థం కావడం లేదని బంధువుల పేర్కొంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement