
రోడ్డుపై పడి ఉన్న మందుబాబు
పలమనేరు: బస్సులో ఎక్కి పూటుగా మద్యం సేవించి నానా హంగామా చేసి ప్రయాణికుల వద్ద దెబ్బ లు తిన్న యువకుని వ్యవహారం మంగళవారం పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నా యి. తిరుపతిలో కర్ణాటక ఆర్టీసీ రాజహంసలో బస్సు ఎక్కి ఓ 26 ఏళ్ల యువకుడు బెంగళూరుకు టికెట్ తీసుకున్నాడు. బస్సు కొంతదూరం కదలగానే పూటుగా మద్యం సేవించాడు. బంగారుపాళెం వచ్చేసరికి కిక్కు ఎక్కువై ‘నా లవర్ మోసం చేసింది’ అంటూ కేకలు వేస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు.
ఎంత చెప్పినా వినకపోవడంతో అతన్ని ప్రయాణికులు చితకబాదారు. విధిలేక కండక్టర్, డ్రైవర్లు అతన్ని పలమనేరులోని అంబేడ్కర్ సర్కిల్‌లో బస్సు నుంచి దించేశారు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు ఐలవ్‌యూ అంటూ గట్టిగా అరుస్తూ జనంపైకి మట్టిని చల్లడం ప్రారంభించాడు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు అదుపు చేసేందుకు యత్నించినా లాభం లేక పోయింది. దీంతో అక్కడున్న స్థానికులు అతనిపై నీళ్లు పోసి మత్తు దింపారు. అదే బస్సులోకి అతన్ని ఎక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment