
యువతితో మాయగాడు గణేశ్
మైసూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు సార్లు అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమని కోరితే కులం పేరుతో తిరస్కరించాడు. మూడేళ్ల క్రితం విజయనగరకు చెందిన యువతికి, స్థానికుడైన గణేశ్ అనే యువకునికి పరిచయమై ప్రేమ ఏర్పడింది. ఇటీవల యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని కోరింది. ప్రియుడు అబార్షన్ చేయించి, పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి విజయనగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
గణేశ్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఒక నెల జైలు వాసం తర్వాత బెయిల్‌పై వచ్చిన నిందితుడు యువతికి మళ్లీ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. యువతి తిరిగి గర్భం దాల్చగా ఈసారైనా పెళ్లి చేసుకుందామని అడిగింది. దీంతో అతడు కోపంతో ఆమె కడుపు మీద తన్నడంతో గర్భస్రావం కూడా జరిగింది. గణేశ్‌తో తనకు పెళ్లి చేయకపోతే బతకనని యువతి చెబుతోంది. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment