
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఇప్పటికే లావణ్య కొట్టిపారేసింది. తమ మధ్య ఏం లేదని, అవన్ని పుకార్లేనని చెప్పి రూమర్స్‌కి చెక్ పెట్టింది. అయితే తాజాగా తన కామెంట్స్‌తో మరోసారి డేటింగ్ రూమర్స్‌కు తెరలేపింది లావణ్య. ఇటీవల ఓ షోలో పాల్గొన్న లావణ్య వరుణ్ తేజ్‌పై ఉన్న క్రష్‌ను బయటపెట్టింది.
చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం
దీంతో మరోసారి లావణ్య వార్తల్లోకికెక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. లావణ్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పులిమేక’. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం కలిసి ఓ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ‘మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు’ అని అడిగిన యాంకర్ సుమ వాటికి A-నాని, B-వరుణ్ తేజ్‌ఆప్షన్లు ఇచ్చింది. దీనికి ఆన్సర్ ఇచ్చిన లావణ్య.. వరుణ్ తేజ్ పేరు చెప్పి తన మనసులో మాట బయటపెట్టింది.
చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో!
దీంతో యాంకర్ సుమతో పాటు పులిమేక టీం కోనవెంకట్, సిరిలు కూడా అవాక్కయ్యారు. ఆమె సమాధానానికి అక్కడ ఉన్నవారంత ఒక్కసారిగా గట్టిగా అరవడంతో లావణ్య ముసిముసి నవ్వులు నవ్వింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వరుణ్ తేజ్‌పై తనకున్న క్రష్‌ని లావణ్య ఇలా బయటపెట్టిందా అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్’,‘అంతరిక్షం’ చిత్రాల్లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లోనే వారిమధ్య ప్రేమ చిగురించిందనే పుకార్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment