సాక్షి, విజయవాడ : ప్రముఖ నటుడు మహేశ్‌బాబు సతీమణి నమ్రత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నమ్రత వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు. అలాగే ఆలయ ఈవో చేతుల మీదుగా నమ్రతకు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.
వైఎస్ భారతిరెడ్డిని కలిసిన నమ్రతా శిరోద్కర్
అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతిరెడ్డిని..నమ్రతా శిరోద్కర్ మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సందర్భంగా బుర్రిపాలెం గ్రామ అభివృద్ధి పనులపై నమత్ర చర్చించారు. కాగా హీరో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టిన ఊరైన గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. గ్రామమ్ ఫౌండేషన్ ద్వారా బుర్రిపాలెంలో అభివృద్ధి పనులు మహేష్ బాబు చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఏపీ ప్రభుత్వంతో కలిసి గ్రామం ఫౌండేషన్ ద్వారా గ్రామాభివృద్ధి కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నమత్ర ఈ సందర్భంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment