
సాక్షి,విజయవాడ : కనక దుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా పోలీసులు కాళ్లకు షూ వేసుకొని అమ్మవారి ఆలయ ముఖద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్నారు.
పోలీసులు షూ వేసుకుని డ్యూటీ చేయడంపై భవానీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అయితే, ఆలయ ముఖద్వారం వద్ద షూ వేసుకుని డ్యూటీ చేస్తున్నా చూసి చూడనట్టు ఆలయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు భక్తులను విస్మయానికి గురి చేస్తుంది.
కాగా, ఆలయాల పవిత్రతను కాపాడుతామని సీఎం చంద్రబాబు ,మంత్రులు చెబుతున్నా ఆచరణలో ఎక్కడా కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment