బెజవాడ బుల్లోడినే.. | actor srikanth new film start | Sakshi
Sakshi News home page

బెజవాడ బుల్లోడినే..

Published Mon, Dec 8 2014 1:58 AM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

బెజవాడ బుల్లోడినే.. - Sakshi

బెజవాడ బుల్లోడినే..

సినీ నటుడు శ్రీకాంత్ కొత్త సినిమా షూటింగ్ కోసం ఆదివారం ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన తన చిన్ననాటి సంగతులు, తన కొత్త సినిమా విశేషాలు వెల్లడించారు. ఆ వివరాలు ...

విలన్‌గా అద్భుతమైన పాత్రలు పోషించి.. అనతికాలంలోనే హీరోగా ఉన్నతస్థానానికి చేరుకుని విజయవంతమైన చిత్రాల్లో నటించారు హీరో శ్రీకాంత్. పెళ్లిసందడి, తాజ్‌మహల్, ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించి సినీరంగంలో ఉన్నతస్థానానికి చేరుకున్న ఆయనకు విజయ  వాడతో ప్రత్యేక అనుబంధమే ఉంది. శ్రీకాంత్ మన జిల్లాలోనే పుట్టినా.. తరువాత కర్ణాటక వెళ్లిపోయూరు. బాల్యం అంతా బెజవాడలోనే గడిచింది. ఓ సినిమా షూటింగ్ కోసం ఆదివారం నగరానికి వచ్చిన శ్రీకాంత్ కొద్దిసేపు ‘సాక్షి’తో ముచ్చటించారు.     - సాక్షి, విజయవాడ

- హీరో శ్రీకాంత్
సాక్షి : మీ కొత్త సినిమా విశేషాలేమిటి?
శ్రీకాంత్ :
కొత్త సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్ నాది. ఫ్యామిలీతో పాటు రాజకీయం కొంత టచ్‌లో ఉండే పాత్ర. ఇక మిగిలిన విషయాలు చెబితే కథలో సస్పెన్స్ పోతుంది. దర్శకుడు బాబ్జీ (శ్రీను) మంచి కథా రచయితగా నాకు తెలుసు. మంచి కథతో పాటు శ్రీను దర్శకత్వం వహిస్తే ప్లస్ పాయింట్ అవుతుందని ఆయన్ను ఒప్పించాం.
 
సాక్షి : ప్రస్తుతం నటిస్తున్న మిగతా సినిమాలు?
 శ్రీకాంత్ :
జల్సారాయుడు, నాటుకోడి, ఢీ అంటే ఢీతో పాటు సతీష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా. వీటిలో జల్సారాయుడు త్వరలోనే విడుదలకానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
 
సాక్షి : మీ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది?
శ్రీకాంత్ :
బాల్యం అంతా బెజవాడలోనే గడిచింది. నగరానికి చెందిన లక్ష్మీ ఫిలిమ్స్ నా సినీ ఎదుగుదలకు ఎంతో సాయమందించింది.
 
సాక్షి : నవ్యాంధ్రలో సినిమాలకు   అనుకూలమైన ప్రాంతమేది?
శ్రీకాంత్ :
విజయవాడతో పాటు వైజాగ్, శ్రీకాకుళం పరిసరాలు షూటింగ్‌లకు అనుకూలం. ఇప్పటికే వైజాగ్, శ్రీకాకుళంతో పాటు రాజమండ్రి పరిసరాల్లో జరుగుతున్నాయి. ఇకపై విజయవాడలో కూడా షూటింగ్‌లు ఎక్కువగా జరుగుతాయని భావిస్తున్నా. మా నుంచే ప్రారంభం అయితే అందరికీ మంచిదే.
 
సాక్షి : నగరంతో మీకున్న అనుబంధం?
శ్రీకాంత్ :
నా చిన్నతనమంతా విజయవాడలోనే సాగింది. ఇక.. నా చెల్లెల్ని నగరంలోని పటమటకు కోడల్ని చేశాను. ఏడాదిలో కనీసం కొన్ని రోజులైనా నగరంలోనే గడుపుతాను. పైగా.. దుర్గమ్మను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. అమ్మ దయతో కొత్త సినిమా విజయవంతం కావాలని కోరుకున్నా.
 
సాక్షి : షూటింగ్‌లకు విజయవాడ అనుకూలమేనా..?
శ్రీకాంత్ : పల్లెలు, సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేసేందుకు విజయవాడ ఎంతో అనువుగా ఉంటుంది. దీనికితోడు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రకటించారు. ఇకపై మరికొంతమంది నగరంలో సినిమాలు నిర్మించే అవకాశం ఉంది. అయితే, దీనికి నగర ప్రజలతో పాటు పోలీసుల సహకారం ఎంతో అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement