బెజవాడలో రేపు బాబు 2 కి.మీ పాదయాత్ర | Chandrababu Naidu to launch janmabhoomi programme from vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో రేపు బాబు 2 కి.మీ పాదయాత్ర

Published Wed, Oct 1 2014 11:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

Chandrababu Naidu to launch janmabhoomi programme from vijayawada

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడలో 2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2 నుంచి 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ యాత్ర చేపట్టనున్నారు. జన్మభూమితో  పాటు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ సుజల, ఎన్టీఆర్ భరోసా తదితర కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. సీఎంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారి కూడా జన్మభూమిలో పాల్గొంటారు. కాగా  ఈ నెల 2వ తేదీ నుంచి 20 వరకూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమం నిర్వహించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement