‘హృదయ కాలేయం’ పాటలు
‘‘నీ జీవితానికి నువ్వే హీరో’ అన్న పవన్‌కల్యాణ్ మాట నాకు బాగా నచ్చింది. అప్పుడే అనుకున్నా ‘హృదయ కాలేయం’ సినిమాకి నేనే హీరో అని. హృదయం, కాలేయం ఉన్నవారు తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారు’’ అని సంపూర్ణేష్‌బాబు అన్నారు.

‘హృదయ కాలేయం’... కొన్నాళ్లుగా సోషల్‌నెట్‌వర్క్ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించాడు సంపూర్ణేష్. ఏ ‘హృదయ కాలేయం’ ద్వారా పాపులర్ అయ్యాడో... అదే టైటిల్‌తో ఆయన హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. స్టీవెన్ శంకర్ దర్శకుడు. సాయిరాజేష్ నీలం నిర్మాత. కె.కె. స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని మారుతి ఆవిష్కరించి, సందీప్ కిషన్‌కి అందించారు.
సంపూర్ణేష్ మాట్లాడుతూ -‘‘సినీ పరిశ్రమలో కొత్తవారికి అవకాశాలుండవని, బ్యాగ్రౌండ్ ఉంటేనే ఇక్కడ ఎదుగుదల సాధ్యమని చాలా మంది అభిప్రాయం. కానీ మనల్ని మనం కొత్తగా ప్రజెంట్ చేసుకుంటే అవకాశాలు అవే వస్తాయి’’ అని తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ్, కె.ఎల్.దామోదర్‌ప్రసాద్, మల్టీడైమన్షన్ వాసు, మారుతి, వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, వీరశంకర్, సందీప్‌కిషన్, రాహుల్, దేవిప్రసాద్, వివేక్ కూచిభొట్ల, మధురా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.