
ఆ డైలాగులకు సునామీ వచ్చేలా ఉంది
- మారుతి
‘‘సంపూ ఎంత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడో తెలుసుకున్నాక అతనిపై గౌరవం పెరిగింది. టీజర్ చూస్తుంటే సినిమా హిట్ అవుతుందనడంలో సందేహం లేదు’’ అని హీరో సాయిధరమ్ తేజ్ పేర్కొన్నారు. సంపూర్ణేశ్ బాబు, గాయత్రి, గీతాంజలి ముఖ్యతారలుగా రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో సాయిరాజేశ్ నీలం, ఆది కుంభగిరి నిర్మించిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో సాయిధరమ్ తేజ్, దర్శకుడు మారుతి విడుదల చేశారు.
మారుతి మాట్లాడుతూ- ‘‘టీజర్‌లో సంపూ చెప్పిన డైలాగులకు సునామీ వచ్చేలా ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం టీజర్ సాయిధరమ్ తేజ్ లాంచ్ చేస్తుంటే, నాకు సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవిగారు లాంచ్ చేశారనే ఫీలింగ్ కలిగింది’’ అని సంపూర్ణేశ్ బాబు అన్నారు. ఈ వేడుకలో ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీవెన్ శంకర్, నిర్మాత సాయిరాజేశ్ నీలం పాల్గొన్నారు.