
సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వర రావు దర్శకుడు. మహేశ్వరి వద్ది కథానాయిక. బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. సంధిరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, మోషన్ పోస్టర్‌కి మంచి ఆదరణ లభించింది’’ అన్నారు. ‘‘నవ్వులు, పాటలు, ఫైట్స్.. ఇలా ప్రేక్షకులకు కిక్ ఇచ్చే హంగులతో సినిమా ఉంటుంది’’ అన్నారు వసంత నాగేశ్వరరావు. ‘‘మా చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేస్తాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత శేఖర్ అలవలపాటి.
Comments
Please login to add a commentAdd a comment