సంపూర్ణేశ్‌తో సినిమా అంటే వద్దన్నాను!
‘‘విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఆరంభించి, కొత్త టెక్నీషియన్స్‌ను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. హఠాత్తుగా ఒక రోజు సంపూర్ణేశ్ బాబుతో సినిమా చేస్తానని విష్ణు చె బితే, నేనొప్పుకోలేదు. కానీ అతనితోనే చేస్తానని పట్టుబట్టేసరికి కాదనలేక పోయాను’’ అని మోహన్‌బాబు అన్నారు. సంపూర్ణేశ్‌బాబు, సనమ్ జంటగా డా. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘సింగం 123’. అక్షత్ అజయ్ శర్మ దర్శకుడు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా చూసినపుడు సంపూర్ణేశ్ బాబులో ఇంత మంచి నటుడు ఉన్నాడా అనిపించింది. ప్రతి సన్నివేశంలో చాలా అద్భుతంగా నటించాడు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, రచయిత డైమండ్ రత్నం, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.