Singam 123
-
‘కంటి చూపుతో కాదు.. అరటిపండుతో చంపేస్తా’
సినిమాల్లో వచ్చే ఫైట్ సీన్స్ చాలా కామెడీగా, లాజిక్ లేకుండా ఉంటాయి. వందమంది విలన్లనైనా సరే మన హీరో ఒంటి చేత్తో రఫ్పాడిస్తాడు. అదీ చొక్కా నలగకుండా. విలన్ ఎంతటి వాడైనా సరే చివరకు హీరోదే పై చేయి అవుతుంది. ఇవే కాక కొన్ని సినిమాల్లో వచ్చే స్పెషల్ ఎఫెక్ట్లు మరీ దారుణంగా ఉంటాయి. తొడగొడితే.. ట్రైన్ ఆగిపోవడం, మీసం తిప్పితే.. ప్రత్యర్థులు భయపడటం వంటివి. వీటికి లాజిక్ లేకపోయినా సినిమాలో హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి ఇలాంటి సీన్లు తీస్తుంటారు. తాజాగా అలాంటి ఓ ఫైట్ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సీన్లో మన హీరో ఏకంగా అరటి పండుతోనే అరడజను మంది విలన్ల పీకలు కోస్తున్నాడు. అరటి పండుతో పీకలు కోయడం ఏంటని అనుకుంటున్నారా.. అదే మరి మన సినిమాల గొప్పతనం. హీరో తల్చుకుంటే అరటి పండు ఏం ఖర్మ..! దాని తొక్కతో కూడా ప్రత్యర్థుల బెండు తీయగలడు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. ‘హృదయ కాలేయం’ ఫేం సంపూర్ణేష్ బాబు హీరోగా.. అమిత్ నాయర్ దర్శకత్వంలో 2015లో వచ్చిన సింగమ్ 123 సినిమాలోనిది ఈ సీన్. అదిప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయింది. Senjata dan action scene TNCFU masih kalah brutal, jauh. pic.twitter.com/iZGKkaVyna — Kampus Film (@kampusfilmID) December 25, 2018 30 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సంపూ అరటి పండుతో విలన్ల పీకలు కోస్తాడు. అదే విలన్ గన్‌తో ఫైర్ చేసినా మన హీరోకేం కాదు. బుల్లెట్ల నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటాడు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియో నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా వాళ్లకు తెగ నచ్చిందంట. దాంతో మొత్తం సినిమా చూడ్డానికి సాయం చేయండని నెట్‌ఫ్లిక్స్ ఇండియా వారిని కోరారు. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ ఇండోనేషియా తెరకెక్కించిన ‘నైట్ కంమ్స్ ఫర్ ఆస్’ సినిమాలో కూడా సేమ్ ఇలాంటి సీనే ఉందంట. వీరి రిక్వెస్ట్‌కు స్పందించిన సినిమా నిర్మాత, హీరో మంచు విష్ణు సినిమా సీడీని నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్‌కు పంపిస్తానని ట్వీట్ చేశారు. Dammmmmmnnnnn, Boy! ROFL 🤣 🤣😂🤣😂🤣 @NetflixIndia @NetflixID You got it! Will send it over to your office!!!! https://t.co/7tO4wwvH5V — Vishnu Manchu (@iVishnuManchu) December 27, 2018 -
సంపూర్ణేశ్తో సినిమా అంటే వద్దన్నాను!
‘‘విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఆరంభించి, కొత్త టెక్నీషియన్స్‌ను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. హఠాత్తుగా ఒక రోజు సంపూర్ణేశ్ బాబుతో సినిమా చేస్తానని విష్ణు చె బితే, నేనొప్పుకోలేదు. కానీ అతనితోనే చేస్తానని పట్టుబట్టేసరికి కాదనలేక పోయాను’’ అని మోహన్‌బాబు అన్నారు. సంపూర్ణేశ్‌బాబు, సనమ్ జంటగా డా. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన చిత్రం ‘సింగం 123’. అక్షత్ అజయ్ శర్మ దర్శకుడు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా చూసినపుడు సంపూర్ణేశ్ బాబులో ఇంత మంచి నటుడు ఉన్నాడా అనిపించింది. ప్రతి సన్నివేశంలో చాలా అద్భుతంగా నటించాడు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, రచయిత డైమండ్ రత్నం, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. -
ఎవర్నీ నొప్పించే ఉద్దేశం లేదు : మంచు విష్ణు
‘‘ ‘హృదయ కాలేయం’ చూశాక సంపూర్ణేశ్ బాబుతో సినిమా చేయాలని అనుకున్నా. ‘సింగం 123’ కేవలం ఓ స్పూఫ్ మాత్రమే. ఈ చిత్రాన్ని కామెడీ యాంగిల్లోనే చూడ మని నా తోటి నటీనటులను కోరుతున్నా. ఈ చిత్రంతో ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదు’’ అని మంచు విష్ణు అన్నారు. ఆయన నిర్మాతగా, సంపూర్ణేశ్ బాబు హీరోగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సింగం 123’. శేషు కేఎంఆర్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంపూర్ణేశ్ బాబు మాట్లాడుతూ -‘‘కరెంట్ తీగ సినిమాలో చిన్న రోల్ చేశాను. ఆ రోల్ నాకు చిన్నదైపోయిందేమో అని నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా చేసేశారు. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు చేశాను’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘విష్ణు నిర్మాతగానే కాకుండా ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఓ డిఫరెంట్ సంపూను చూస్తారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘డైమండ్’ రత్నం, ఛాయాగ్రాహకుడు సతీశ్ ముత్యాల, నటులు వైవా హర్ష, విజయ్, అనంత్ తదితరులు పాల్గొన్నారు. -
సంపు 'సింగం 123' ఆడియో విడుదల