టాలీవుడ్ 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బజార్ రౌడీ’.సంపూర్ణేశ్ బాబుకు జోడీగా మహేశ్వరి వద్ది హీరోయిన్‌గా నటిస్తుంది. ఆగస్టు20న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బజార్ రౌడీ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘రౌడీలకు రామాయణం చెప్తే రావణాసురుడిని ఫాలో అవుతారు కానీ రాముడ్ని కాదు’, ‘నీకు బాంబే (ముంబయి)లో బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చు. నాకు బాంబేనే బ్యాక్‌గ్రౌండ్’ వంటి డైలాగులు హైలైట్‌గా నిలిచాయి.
ఈ చిత్రానికి వసంత నాగేశ్వర రావు దర్శకత్వం వహిస్తుండగా.. కేఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. షాయాజి షిండే, కత్తి మహేశ్, కరాటే కల్యాణి, పృథ్వి, నాగినీడు, షఫి, జీవ, సమీర్, మణిచందన, నవీన, పద్మావతి తదితురలు ముఖ్యపాత్రల్లో నటించారు.
చదవండి : కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను: లేడీ కమెడియన్
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ కు సెన్సార్ పూర్తి
Comments
Please login to add a commentAdd a comment