
అక్క పెట్టిన ఆవకాయ ఇష్టం
పెరుగన్నంలోకి ఆవకాయలేందే ముద్ద తిగదు. అంతేకాదు అటుకులు, మరమరాల్లో కూడా మామిడి చట్నీ కలుపుకొని తినడం ఇష్టం. యేడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి కన్నా లేత మామిడికాయను చిన్న ముక్కముక్కలుగా తరిగి పెట్టే పచ్చడంటే ప్రాణం. మామిడికాయ చట్నీ పెట్టడంలో మా అక్కయ్య భాగ్యమ్మ తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది. మొన్నే పెట్టేసిందట.. వచ్చి తీసుకెళ్లు అంది. టైమ్‌లేక వెళ్లలేదు. అమ్మ (కమలమ్మ) అయితే పెట్టి పంపించేసింది. అక్క పెట్టిన పచ్చడీ తెచ్చుకోవాలి. కొత్త పచ్చడి వచ్చిందంటే ఓ వారం దాకా దాంతోనే భోజనం. ఎన్ని అద్భుతమైన కూరలున్నా మామిడికాయ పచ్చడి ముందు దిగదిడుపే!
- సంపూర్ణేశ్ బాబు