"Mr బెగ్గర్"గా బర్నింగ్ స్టార్ సంపూ | Sampoornesh Babu Mr Beggar Movie Shooting Starts Shortly | Sakshi
Sakshi News home page

"Mr బెగ్గర్"గా బర్నింగ్ స్టార్ సంపూ

Published Sat, Jan 1 2022 11:42 AM | Last Updated on Thu, Jun 9 2022 7:10 PM

Sampoornesh Babu Mr Beggar Movie Shooting Starts Shortly - Sakshi

Sampoornesh Babu: వరుస సినిమాలతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు దూసుకుపోతున్నారు. ఇటీవలే విడుదలైన క్యాలీ ఫ్లవర్ సినిమా ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించింది. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా “Mr బెగ్గర్” పోస్టర్‌ వదిలారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. కార్తీక్ మూవీస్ పతాకంపై వడ్ల జనార్దన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు గురురాజ్, కార్తిక్ వడ్ల నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఫణీంద్ర వర్మ అల్లూరి. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement