వారి ప్రేమకు బానిసను: సంపూర్ణేష్ | Sampoornesh Babu happy to meet cm kcr | Sakshi
Sakshi News home page

వారి ప్రేమకు బానిసను: సంపూర్ణేష్

Nov 27 2017 7:54 PM | Updated on Aug 15 2018 9:40 PM

Sampoornesh Babu happy to meet cm kcr - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు నటుడు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఇన్నేళ్లకి నా కల నెరవేరిందంటున్నాడు సంపూ. ఇంతకీ ఆయన కల ఏంటనేగా.. ఆ వివరాలపై ఓ లుక్కేయండి. సంపూర్ణేష్ బాబు (నర్సింహా చారి)కు అభిమాన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనను కలవాలని ఈ నటుడికి ఎప్పటినుంచో కోరిక. అది ఇప్పుడు సాకారం కావడంతో సంపూ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకు సంపూ చేసిన ట్వీట్ ను గమనించండి.

'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, నా అభిమాన నాయకుడు, మా కేసీఆర్ గారిని కలవటం నా కల...ఆ కల ఇన్నేళ్ళకి సాకారం అయింది. మంత్రి కేటీఆర్ గారిని కూడా కలిశాను. సదా వారి ప్రేమకి నేను బానిసను' అంటూ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశారు. కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోలను ట్వీట్టర్‌లో తన ఫాలోయర్లతో షేర్ చేసుకున్నాడు. సంపూ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement