
విద్యార్థులకు సంపూ బహుమతి..
'హృదయ కాలేయం' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు సంపూర్ణేష్ బాబు ఓ స్కూలు విద్యార్థుల మనసు గెలుచుకున్నాడు. చిత్రమైన గెటప్లు, విచిత్రమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరిస్తున్న సంపూ తోటివారికి సాయం చేయడానికి 'నేను సైతం' అంటూ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా సంపూ తదుపరి చిత్రం 'కొబ్బరిమట్ట' సినిమా షూటింగ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని అరటికట్ల గ్రామంలో జరుగుతుంది.
షూటింగ్ విరామంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించాడు సంపూ. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ.. టాప్ ర్యాంక్ సాధించే బాలురకు రూ.10,000, బాలికలకు రూ.15,000 లు చొప్పున బహుమతిగా ఇస్తానంటూ హామీ ఇచ్చాడు. దాంతో విద్యార్థులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. చదువు విషయంలో అశ్రద్ధ చూపించరాదని, బాగా చదువుకుని తల్లిదండ్రులకు, దేశానికి సేవ చేయాలని విద్యార్థులను కోరాడు.