
సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘బజార్ రౌడి’. డి. వసంత నాగేశ్వరరావు దర్శకుడు. మహేశ్వరి వద్ది హీరోయిన్. బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యంలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ‘నీ వంటికి మెరుపులు బాగా చుట్టేశావే.. నా కంటికి ఏవో రంగులు చూపించావే.. పిల్లా నా మతి చెడగొట్టావే..’ అంటూ సాగే రెండో పాటని రిలీజ్ చేశారు.
నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్‌లో అలరిస్తారు. మా చిత్రం టీజర్‌కి సోషల్ మీడియాలో 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కరోనా తీవ్రత తగ్గిన వెంటనే మా ‘బజార్ రౌడి’ని విడుదల చేస్తాం. మరుధూరి రాజా మాటలు రాయగా, గౌతంరాజు ఎడిటింగ్ చేశారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌ఎస్ ఫ్యాక్టరీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శేఖర్ అలవలపాటి.
Comments
Please login to add a commentAdd a comment