
టాలీవుడ్ 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బజార్ రౌడీ’. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు సరసన మహేశ్వరి వద్ది హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్‌లో సంపూ చెప్పే పంచ్ డైలాగులు నవ్వు తెప్పిస్తున్నాయి. ‘రౌడీయిజం చేయాలంటే జీపు, జీపులో పెట్రోల్.. దాంట్లో రౌడీలు కాదురా దమ్ము, దమ్ము కావాలి’అంటూ సంపూ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. సీరియస్ కామెడీతో పాటు రోమాన్స్ కూగా బాగానే ఉన్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.
ఈ చిత్రానికి వసంత నాగేశ్వర రావు దర్శకత్వం వహిస్తుండగా.. కేఎస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సందిరెడ్డి శ్రీనివాస్ రావు నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. షాయాజి షిండే, పృథ్వి, నాగినీడు, షఫి, జీవ, సమీర్, మణిచందన, నవీన, పద్మావతి తదితురలు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment