
లొంగిపోయిన జగ్గారెడ్డి
హైదరాబాద్, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మూడు రోజుల క్రితం కంటోన్మెంట్ గన్‌రాక్ గార్డెన్‌లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకుగాను వారికి సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులు పంపిణీ చేస్తూ జగ్గారెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో జగ్గారెడ్డితోపాటు మరో ముగ్గురు కూడా కార్ఖానా పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. వీరిని బెయిల్‌పై విడుదల చేసినట్లు సీఐ నాగేశ్వర్‌రావు తెలిపారు.