సంగారెడ్డి టౌన్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం టీపీసీసీ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డిలోని జగ్గారెడ్డి స్వగృహం నుంచి ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
పాత బస్టాండ్ పక్కన గల రాంమందిర్ కమాన్ వద్ద డీఎస్పీ తిరుపతన్న నేతృత్యంలో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకోని పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించారు. కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జగ్గారెడ్డితో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అంతకుముందు జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులు, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, జిల్లాలో ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేయడం సరికాదన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అ«ధికారంలోకి రావడం ఖాయమన్నారు. రైతులు, ప్రజల సమస్యలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిష్కరించగలదన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జీమ్యాథుస్, నాయకులు కుమార్, సంజీవ్, కూన సంతోష్‌కుమార్, నగేష్, భిక్షపతి, ఆంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment