trs govt failures
-
సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకత వస్తోంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైందని, ప్రజల్లో కేసీఆర్‌పై నెలకొన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో సైలెంట్ స్వీప్‌గా వస్తోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్య విలువ లు మృగ్యమైపోయాయని, భావప్రకటనా స్వేచ్ఛకు, పౌరహక్కులకు భంగం కలిగిందని ఆరోపించారు. విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష, నియంతృత్వ విధానాల అమలు వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూజేఎఫ్) సోమవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో చాడ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన నిరుద్యోగ యువత కు ఉద్యోగాలు భర్తీచేయకుండా చిన్నచూపు చూశారన్నారు. సీట్ల సర్దుబాటులో జాప్యం జరిగినా కూటమి ఏర్పడ్డాక కాంగ్రెస్‌కు మంచి ఊపు వచ్చిందన్నారు. ప్రజా ఫ్రంట్‌లో చేరికపై పార్టీదే నిర్ణయం ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో సీపీఐ చేరికపై పార్టీదే తుది నిర్ణయమని చాడ తెలిపారు. వామపక్ష ఐక్యతను దెబ్బతీసే విధంగా సీపీఎం వ్యవహరించడమే కాకుండా తాము కలిసి రాలేదని ఆపార్టీ ఆరోపిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి వేదిక పంచుకోలేమంటోన్న సీపీఎం జాతీయ స్థాయిలో మాత్రం రాహుల్ గాంధీతో వేదిక పంచుకుంటోందని, ఇది దేనికి సంకేతమో ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. -
రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
సంగారెడ్డి టౌన్: టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం టీపీసీసీ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డిలోని జగ్గారెడ్డి స్వగృహం నుంచి ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ పక్కన గల రాంమందిర్ కమాన్ వద్ద డీఎస్పీ తిరుపతన్న నేతృత్యంలో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకోని పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించారు. కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జగ్గారెడ్డితో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులు, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడం, జిల్లాలో ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేయడం సరికాదన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అ«ధికారంలోకి రావడం ఖాయమన్నారు. రైతులు, ప్రజల సమస్యలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిష్కరించగలదన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జీమ్యాథుస్, నాయకులు కుమార్, సంజీవ్, కూన సంతోష్‌కుమార్, నగేష్, భిక్షపతి, ఆంజనేయులు పాల్గొన్నారు. -
కేసీఆర్ పాలన అవినీతిమయం
అన్నీ అబద్ధాలు, అక్రమాలు, మోసాలే: ఉత్తమ్ - టీఆర్ఎస్కు పతనం ప్రారంభమైంది - 9న సోనియాకు కృతజ్ఞతా దినోత్సవం - 20న ఇందిరా పార్కు వద్ద ఒకరోజు దీక్ష నిర్వహిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని... కానీ సీఎం కేసీఆర్ పాలనలో రాజకీయ దిగజారుడు, అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, మోసం తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ వర్గమూ సంతోషంగా లేదని, టీఆర్ఎస్ పాలనలో నిరాశ, నిసృ్పహలే మిగిలాయని పేర్కొన్నారు. కేసీఆర్ హామీలను అమలుచేయకుండా, రోజుకో కొత్త అబద్ధంతో కాలం వెల్లదీస్తున్నారని.. నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు షబ్బీర్ అలీ, ప్రసాద్ కుమార్, మర్?ర శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్, మల్లు రవిలతో కలసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ ఇళ్లు, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, కేజీ నుంచి పీజీ వంటి హామీలను గాలికొదిలేసి... కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నారని ఆరోపించారు. రైతులెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వ్యవసాయం పండుగలా ఉంటుందని చెప్పిన సీఎం కేసీఆర్ పాలనలోనే 3 వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఉత్తమ్ నిలదీశారు. ఆహారధాన్యాల ఉత్పత్తి 2014లో 107 టన్నులు ఉంటే... ఈ ఏడాది 49 లక్షల టన్నులకు పడిపోరుుందని చెప్పారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తామన్న కేసీఆర్.. ఎంత మందికి భూమి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం లేకుండా పోరుుందని... మంత్రివర్గంలో మహిళకు అవకాశం ఇవ్వలేదని, ఎస్సీల్లోని మెజారిటీ సామాజికవర్గానికి అవకాశం లేకుండా పోరుుందని విమర్శించారు. అంతా అవినీతిమయం అవినీతి లేని పాలన చేస్తామని చెప్పి.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పెద్ద ఎత్తున నగదు దొరికిందని, భూమి పత్రాలు, రాజకీయ నేతల పేర్లు, పోలీసు అధికారుల పేర్లు వెల్లడయ్యాయని చెప్పిన ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిందేమిటని ప్రశ్నించారు. ‘ఓటుకు నోటు’ కేసులోనూ, ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎంసెట్ పేపర్ లీక్‌లో ప్రభుత్వ పెద్దల హస్తం ఉండటం వల్లనే ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని గుర్తు చేసిన ఉత్తమ్.. ఆ రోజున సోనియగాంధీకి కృతజ్ఞతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రుణమాఫీ, ఫీజు రీరుుంబర్స్‌మెంటు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు, ఉద్యోగులకు పీఆర్సీ అమలు వంటి అంశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 20న ఇందిరాపార్కు వద్ద ఒకరోజు సామూహిక దీక్ష చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు.