కేసీఆర్ పాలన అవినీతిమయం | tpcc one day deeksha on december 20th over trs govt failures | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పాలన అవినీతిమయం

Published Sat, Dec 3 2016 1:28 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

కేసీఆర్ పాలన అవినీతిమయం - Sakshi

కేసీఆర్ పాలన అవినీతిమయం

అన్నీ అబద్ధాలు, అక్రమాలు, మోసాలే: ఉత్తమ్
- టీఆర్‌ఎస్‌కు పతనం ప్రారంభమైంది
- 9న సోనియాకు కృతజ్ఞతా దినోత్సవం
- 20న ఇందిరా పార్కు వద్ద ఒకరోజు దీక్ష నిర్వహిస్తామని వెల్లడి  
 
 సాక్షి, హైదరాబాద్: ఎన్నో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని... కానీ సీఎం కేసీఆర్ పాలనలో రాజకీయ దిగజారుడు, అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, మోసం తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ వర్గమూ సంతోషంగా లేదని, టీఆర్‌ఎస్ పాలనలో నిరాశ, నిసృ్పహలే మిగిలాయని పేర్కొన్నారు. కేసీఆర్ హామీలను అమలుచేయకుండా, రోజుకో కొత్త అబద్ధంతో కాలం వెల్లదీస్తున్నారని.. నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు షబ్బీర్ అలీ, ప్రసాద్ కుమార్, మర్?ర శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్, మల్లు రవిలతో కలసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ ఇళ్లు, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, కేజీ నుంచి పీజీ వంటి హామీలను గాలికొదిలేసి... కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నారని ఆరోపించారు.

 రైతులెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు?
 టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే వ్యవసాయం పండుగలా ఉంటుందని చెప్పిన సీఎం కేసీఆర్ పాలనలోనే 3 వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఉత్తమ్ నిలదీశారు. ఆహారధాన్యాల ఉత్పత్తి 2014లో 107 టన్నులు ఉంటే... ఈ ఏడాది 49 లక్షల టన్నులకు పడిపోరుుందని చెప్పారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తామన్న కేసీఆర్.. ఎంత మందికి భూమి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సామాజిక న్యాయం లేకుండా పోరుుందని... మంత్రివర్గంలో మహిళకు అవకాశం ఇవ్వలేదని, ఎస్సీల్లోని మెజారిటీ సామాజికవర్గానికి అవకాశం లేకుండా పోరుుందని విమర్శించారు.

 అంతా అవినీతిమయం
 అవినీతి లేని పాలన చేస్తామని చెప్పి.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత పెద్ద ఎత్తున నగదు దొరికిందని, భూమి పత్రాలు, రాజకీయ నేతల పేర్లు, పోలీసు అధికారుల పేర్లు వెల్లడయ్యాయని చెప్పిన ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిందేమిటని ప్రశ్నించారు. ‘ఓటుకు నోటు’ కేసులోనూ, ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎంసెట్ పేపర్ లీక్‌లో ప్రభుత్వ పెద్దల హస్తం ఉండటం వల్లనే ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని గుర్తు చేసిన ఉత్తమ్.. ఆ రోజున సోనియగాంధీకి కృతజ్ఞతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రుణమాఫీ, ఫీజు రీరుుంబర్స్‌మెంటు, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు, ఉద్యోగులకు పీఆర్సీ అమలు వంటి అంశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 20న ఇందిరాపార్కు వద్ద ఒకరోజు సామూహిక దీక్ష చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement