Comedian Yadamma Raju Gives Clarity About Divorce Rumours With Wife Stella - Sakshi
Sakshi News home page

Yadamma Raju Divorce Rumours: కమెడియన్ జంట విడాకులు?.. స్పందించిన దంపతులు!

Published Wed, Jun 28 2023 5:09 PM | Last Updated on Sun, Apr 28 2024 10:58 AM

Comedian Yadamma Raju Divorce With Wife Stella Gives Clarity - Sakshi

కమెడియన్ ‍యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటాస్ కామెడీ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు కామెడీ షోల్లో మెప్పించారు. గతేడాది తన ప్రియురాలు షార్లీ స్టెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తమ యూట్యూబ్ ఛానెల్‌లో పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తున్నారు.

(ఇది చదవండి: ప్రేయసిని పెళ్లాడిన కమెడియన్‌ యాదమ్మరాజు.. ఫొటోలు వైరల్‌)

అయిచే వీరి పెళ్లి జరిగి కొద్ది నెలలకే ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే ఓ టీవీ షో పాల్గొన్న ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో ఇది చూసిన అభిమానులు నిజంగానే విడాకులు తీసుకుంటున్నారా? అనే చర్చ మొదలెట్టారు. అయితే ఇదంతా టీవీ షో ప్రోమో కోసమే ఇలా చేసినట్లు తెలుస్తోంది. 

అయితే సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వార్తలపై యాదమ్మ రాజు, స్టెల్లా ఇన్‌స్టా వేదికగా స్పందించారు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. కేవలం తాము పాల్గొంటున్న షోలో థీమ్ కోసం డైవర్స్ అనే కాన్సెప్ట్‌లో భాగంగా అలా చేసినట్లు తెలిపారు. దయచేసి ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దు. ఉదయం నుంచి చాలమంది నుంచి కాల్స్ కూడా చేశారు. అందుకే క్లారిటీ కోసమే ఈ వీడియో చేస్తున్నాం. అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటోందన్న వార్తలకు వీడియోతో చెక్ పెట్టారు. 
(ఇది చదవండి:  విడిపోయి రెండు రోజులు.. నటిపై ట్రోలింగ్‌.. మాజీ భర్త ఏమన్నాడంటే?)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement