yadamma
-
పెళ్లై కొన్ని నెలలైనా కాలేదు.. అప్పుడే విడాకులా..!
కమెడియన్ యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటాస్ కామెడీ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు కామెడీ షోల్లో మెప్పించారు. గతేడాది తన ప్రియురాలు షార్లీ స్టెల్లాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తమ యూట్యూబ్ ఛానెల్లో పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తున్నారు.(ఇది చదవండి: ప్రేయసిని పెళ్లాడిన కమెడియన్ యాదమ్మరాజు.. ఫొటోలు వైరల్)అయిచే వీరి పెళ్లి జరిగి కొద్ది నెలలకే ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే ఓ టీవీ షో పాల్గొన్న ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో ఇది చూసిన అభిమానులు నిజంగానే విడాకులు తీసుకుంటున్నారా? అనే చర్చ మొదలెట్టారు. అయితే ఇదంతా టీవీ షో ప్రోమో కోసమే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వార్తలపై యాదమ్మ రాజు, స్టెల్లా ఇన్‌స్టా వేదికగా స్పందించారు. తాము విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. కేవలం తాము పాల్గొంటున్న షోలో థీమ్ కోసం డైవర్స్ అనే కాన్సెప్ట్‌లో భాగంగా అలా చేసినట్లు తెలిపారు. దయచేసి ఈ వార్తలను ఎవరూ నమ్మొద్దు. ఉదయం నుంచి చాలమంది నుంచి కాల్స్ కూడా చేశారు. అందుకే క్లారిటీ కోసమే ఈ వీడియో చేస్తున్నాం. అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ జంట విడాకులు తీసుకుంటోందన్న వార్తలకు వీడియోతో చెక్ పెట్టారు. (ఇది చదవండి: విడిపోయి రెండు రోజులు.. నటిపై ట్రోలింగ్.. మాజీ భర్త ఏమన్నాడంటే?) View this post on Instagram A post shared by sharon stella pastham (@stellaraj_777) -
ప్రియురాలితో కమెడియన్ యాదమ్మ రాజు ఎంగేజ్మెంట్
బుల్లితెర కమెడియన్ యాదమ్మ రాజు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలు షార్లీ స్టెల్లాతో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను యాదమ్మ రాజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో పలువురు బుల్లితెర నటీనటలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పటాస్ అనే కామెడీ షోతో పాపులర్ అయిన యాదమ్మ రాజు పలు టీవీ షోలతో తనదైన కామెడీతో అలరించాడు. ప్రియురాలు స్టెల్లాతో సైతం అతను పలు షోస్‌లో పాల్గొన్నాడు. View this post on Instagram A post shared by YADAMMA RAJU (@yadamma_raju) -
బండి సంజయ్‌కు కృతజ్ఞతలు: వంటమనిషి యాదమ్మ
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధానికి వంటలు చేసే అవకాశం లభించడం జీవితంలో మరపురాని ఘట్టమని, ఇది తనకు దక్కిన అదృష్టమని వంటమనిషి యాదమ్మ తెలిపింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానితోపాటు మరో 500మందికి తెలంగాణ వంటకాలను రుచిచూపించబోతున్నట్లు వివరించింది. ఆదివారం గంగవాయిలి కూర, మామిడి కాయ పప్పు, తోటకూర ఫ్రై, ముద్దపప్పు, పచ్చి పులుసు, మసాల వంకాయ, గోంగూర చట్నీ, సొరకాయ చట్నీ, టమాట చట్నీ, టమాట రసం, సాంబారు, జొన్న రొట్టె, అరిసెలు, బూరెలు, సకినాలు, సర్వ పిండి, పులిహోర, పుదీనారైస్, వైట్ రైస్, బగారా తదితర వంటకాలు చేస్తానని శనివారం ‘సాక్షి’తో వెల్లడించింది. కాగా, వంటలు చేసేందుకు యాదమ్మతో పాటు పదిమంది వస్తారని కోరగా ఆరుగురికే అవకాశం ఇచ్చారు. న్యాక్‌గేట్ వద్ద యాదమ్మ, మరో ఐదుగురు పాస్ కోసం రెండు గంటల ఎదురుచూపు అనంతరం ఎంట్రీ పాస్‌ను అందుకున్నారు. ప్రధాని మోదీకి వంట చేసే అవకాశం కల్పించిన బండి సంజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: (Narendra Modi: దోశ తెప్పించుకుని తిన్న మోదీ) -
మోదీకి యాదమ్మ మెనూ
‘ఇంటి వంట’ స్త్రీలకు అప్పజెప్పి ‘ఉత్సవ వంట’ మగాడు హస్తగతం చేసుకున్నాడు. నలభీములే భారీ వంటలు చేస్తారట. పెద్ద పెద్ద హోటళ్లలో చెఫ్స్ మగాళ్లే ఉండాలట. ఈ మూస అభిప్రాయాన్ని మన తెలంగాణ మహా వంటగత్తె బద్దలు కొట్టింది. ‘వింటే భారతం వినాలి తింటే గూళ్ల యాదమ్మ వంట తినాలి’ అని పేరు సంపాదించింది. అందుకే హైదరాబాద్‌కు మోదీ వస్తుంటే కాల్ యాదమ్మకు వెళ్లింది. ‘యాదమ్మగారూ ఏం వొండుతున్నారు ప్రధానికి?’ అని అడిగితే నోరూరించేలా ఆమె చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? ప్రధాని మోదీ ఇష్టపడే వంటకం ఏమిటో తెలుసా? కిచిడి. ఆయన గుజరాతీ కాబట్టి ‘ఢోక్లా’ అంటే కూడా చాలా ఇష్టం. శనగపిండి, మజ్జిగ కలిపి చేసే ‘ఖాండ్వీ’ ఉంటే మరో ముద్ద ఎక్కువ తింటారు. ఈ మూడూ మామిడి పచ్చడి, శ్రీఖండ్ ఉంటే సరేసరి. అయితే ఈసారి ఆయనను సంతోషపెట్టే వంటకాలు వేరే ఉన్నాయి. అవి అచ్చు తెలంగాణ వంటకాలు. తెలుగు వంటకాలు. హైదరాబాద్ పర్యటనకు హాజరవుతున్న మోదీ ‘స్థానిక వంటకాలు తింటాను’ అని చెప్పినందున సిద్ధమవుతున్నాయి. అయితే వీటిని వండుతున్నది ఫైవ్‌స్టార్ హోటళ్ల చెఫ్‌లు కాదు. కరీంనగర్ పల్లె నుంచి ఇంతింతై ఎదిగిన గొప్ప వంటకత్తె గూళ్ల యాదమ్మ. ఆమెతో ‘సాక్షి’ మాట్లాడింది. గంగవాయిలి కూర... ఆలుగడ్డ వేపుడు ‘మోదీ గారికి ఏం వండాలో చివరి నిమిషంలో చెప్తామన్నారు. కాని తెలంగాణ రుచి తెలియాలంటే ఏం వండాలో మనసులో అనుకున్నా. ముద్దపప్పు, గంగవాయిలి కూర, పప్పు చారు, పుంటికూర, ఆలుగడ్డ వేపుడు, పచ్చి పులుసు చేద్దామనుకుంటున్నా’ అంది గూళ్ల యాదమ్మ. వీటితో పాటు సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్ష్యాలు, పాయసం, పప్పుగారెలు యాదమ్మ లిస్ట్‌లో ఉన్నాయి. ‘ఇంతకాలం 20 వేలు, 50 వేల మందికి వంట చేశాను.135 కోట్ల మందికి ప్రధాని అయిన మోదీకి చేస్తానని ఏనాడూ అనుకోలేదు. ఒక రకంగా దేశ ప్రజలందరికీ వంట చేసినట్లుగానే భావిస్తున్నా’ అంది యాదమ్మ. జీవితం చెదిరినా రుచి కుదిరింది ‘మా స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. అత్తవారు పక్కనే కొండాపూర్. పదిహేనేళ్లకు పెళ్లయితే కొడుకు పుట్టిన మూడు నెలలకు నా భర్త చంద్రయ్య పనిలో మట్టిపెళ్లెలు కూలి మరణించాడు. బతుకు చెదిరిపోయింది. అత్తగారి ఇంట నరకం మొదలయ్యింది. నేనూ నా కొడుకు బతకాలంటే నా కాళ్ల మీద నిలబడాలనుకున్నాను. 1993లో కొండాపూర్‌లో తెల్లవారుజామున 4 గంటలకు భుజాన మూడు నెలల పసిగుడ్డును వేసుకుని బస్టాప్‌కు వచ్చి కరీంనగర్ బస్సెక్కా. కొన్నాళ్లు స్కూల్ ఆయాగా పని చేశా. ఆ తర్వాత నా గురువు వెంకన్న వద్ద పనికి కుదరడం నా జీవితాన్ని మార్చివేసింది. ఆయన రోజుకు 15 రూపాయలు కూలీ ఇచ్చేవాడు. ఆ దశ నుంచి లక్షల రూపాయల కాంట్రాక్టుతో వేల మందికి భోజనం పెట్టే స్థాయికి ఎదిగాను’ అంది యాదమ్మ. నిజానికి భారీ వంటలంటే మగవారే సమర్థంగా చేయగలరు అనే స్థిర అభిప్రాయం ఉంది. కాని యాదమ్మ వేల మందికి అలవోకగా వండుతూ పెద్ద పెద్ద వంట మాస్టర్లను చకితులను చేస్తోంది. ఇది సామాన్యమైన విజయం కాదు. నాటుకోడి... నల్ల మాంసం ‘నేను తెలంగాణ నాన్‌వెజ్ కూడా బాగా చేస్తాను. అవే నాకు పేరు తెచ్చాయి. మటన్, చికెన్, నాటుకోడి, బిర్యానీ, నల్ల మాంసం, బోటీ, చేపల పులుసు, చైనీస్, ఇండియన్ అన్ని వెరైటీలు చేస్తాను.అయితే పని వస్తేనే సరిపోదు.క్రమశిక్షణ ఉండాలి. 25 ఏళ్ల కింద కరీంనగర్ పట్టణంలో స్కూటీ నడిపే ఐదారుగురు మహిళల్లో నేను ఒకదాన్ని. టైంకు ఫంక్షన్లకు వెళ్లాలని పట్టుబట్టి మరీ స్కూటీ నేర్చుకున్నా. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్‌లు బాగా ప్రోత్సహిస్తారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు నాదే వంట. కాలేజీ ఫంక్షన్ల నుంచి రాజకీయ సభల దాకా 20 వేల మందికి ఇట్టే వండిపెడతా.ఈ రోజు నా వద్ద 30 మంది స్త్రీలకు ఉపాధి కల్పిస్తున్నా, నా దగ్గర పని నేర్చుకున్న స్త్రీలు ఎందరో వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడ్డారు క్యాటరింగ్ చేసుకుంటూ’ అందామె. వేములవాడ నుంచి పుష్కరాల దాకా ‘కష్టపడుతూ నిజాయతీగా ఉంటే దేవుడు అవకాశాలు తానే ఇస్తాడు. అలాగే నాకూ ఇస్తున్నాడు. ఏటా శివరాత్రి ఉత్సవాలకు దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో భక్తులకు వండి పెట్టే భాగ్యం దక్కింది. అలాగే కొండగట్టు హనుమాన్ జయంతి వేడుకలకు కూడా పిలుస్తారు. గోదావరి పుష్కరాలకు కూడా వండాను. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తవారింట్లోనే 25 ఏళ్లుగా వంటలు చేస్తున్నాను. సీఎం గారిని చాలాసార్లు చూశాను. ఆయన నా వంటలు రుచి చూశారు. కానీ ఏనాడూ మాట్లాడే అవకాశం దక్కలేదు. ఆయన కుమారుడు కేటీఆర్ మూడు సభలకు వండిపెట్టాను. అందులో అసెంబ్లీ ఎన్నికలకి ముందు తరవాత 50 వేల మందికి వండాను. ఇటీవల తీగల బ్రిడ్జి శంకుస్థాపన సమయంలోనూ 20 వేల మందికి వంట చేశాను. నా వంటలు బాగున్నాయని కేటీఆర్ కితాబిచ్చారు’ అందామె. ఇంటికి పెద్దకొడుకయ్యా ‘నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. మా నాన్న అనారోగ్యంతో చనిపోతూ చిన్న చెల్లె, తమ్ముడు బాధ్యతలను నాకు అప్పగించారు. తమ్ముడిని నా దగ్గరే ఉంచి చదివించి వాడి పెళ్లి చేశాను. చెల్లి పెళ్లిలోనూ నాకు చేతనైనంత సాయపడ్డా. మొన్న ఊళ్లో అమ్మవారి గుడిలో విగ్రహం పెట్టించి, వెండి కిరీటం చేయించా. ఊరంతా కదలివచ్చి అభినందించింది. అంతేకాదు, నాకు ఊరి నుంచి రావాల్సిన మూడున్నర ఎకరాల భూమిని నా కొడుకు వెంకటేశ్ పేరిట ఊరంతా ఒక్కటై చేయించింది’ అందామె. ఒంటరి మహిళలకు భయం వద్దు ‘ఏ కారణం చేతనైనా సమాజంలో మహిళలు ఒంటరిగా బతకాల్సి వస్తే అస్సలు భయపడవద్దు. కష్టపడి చేసే ఏ పనైనా బెరుకు, భయం వద్దు. నిజాయతీగా చేస్తే తప్పకుండా ఎదుగుదల ఉంటుంది. ఆ నిజాయతీ మీకు, మీ పనికి తప్పకుండా గుర్తింపు తీసుకువస్తాయి. ఏనాడూ ఆడిన మాట తప్పకూడదు. అలా చేస్తే మార్కెట్లో, సమాజంలో పలుచనైపోతాం. నేను లక్ష రూపాయల వంటకు ఆర్డర్ తీసుకున్నాక అదేరోజు పని చేయాలంటూ కోటి రూపాయల ఆర్డర్ వచ్చినా తీసుకోను. మాటంటే మాటే.ఆ నిజాయితీ ఉంటే తప్పకుండా పైకి రావచ్చు’ అందామె. యాదమ్మను మెచ్చుకోకుండా ఎలా ఉండగలం? – భాషబోయిన అనిల్‌కుమార్, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ ఫొటోలు: ఏలేటి శైలేందర్‌రెడ్డి -
బీజేపీ జాతీయ సభ.. షెఫ్‌లకు యాదమ్మ ‘వంటల’ పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: ఫైవ్ స్టార్ హోటల్ ప్రధాన షెఫ్‌లు, వారి సహాయకులు తెలంగాణ వంటకాల పాఠాలు నేర్చుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆదివారం ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలను వడ్డించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఫుడ్ కమిటీ ఇన్చార్జీ, మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, ఇతర నేతలు బుధవారం వంట ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా యాదమ్మ చేయబోయే వంటకాల జాబితాను సిద్ధం చేశారు. ఆయా వంటకాలు, కావాల్సిన సామగ్రి గురించి నోవాటెల్–హెచ్ఐసీసీ షెఫ్‌లు కరీంనగర్‌కు చెందిన తెలంగాణ వంటల నిపుణురాలు యాదమ్మ నుంచి వివరాలు తెలుసుకున్నారు. సభ కోసం సర్వపిండి, ముద్ద పప్పు, పచ్చి పులుసు, గంగవాయిలి పప్పు, భక్ష్యాలు, పల్ల పులుసు, మక్క గారెలు, ఉల్లి పకోడి, పంట గారెలు, బెల్లం పరమాన్నం, సేమియా పాయసంతోపాటు మరికొన్ని రకాల వంటలను సిద్ధం చేయనున్నారు. -
ఉస్మానియాలో మహిళా రోగి ఆత్మహత్య
డయాలసిస్ చికిత్స పొందుతున్న ఓ మహిళ ఉస్మానియా ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్‌కు చెందిన యాదమ్మ(50) కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతోంది. ఈ మేరకు డయాలసిస్ చికిత్స కోసం రెండు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరింది. కాగా తాను త్వరలో చనిపోతాననే ఆందోళనతో మానసికంగా కుంగిపోయి మనస్థాపానికి గురై భవనంపై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన యాదమ్మ అక్కడికక్కడే చనిపోయింది. -
యాదమ్మకు ఎన్ని కష్టాలో..
సూరారం (హైదరాబాద్ సిటీ): నిరంతరం రద్దీగా ఉండే రోడ్డును దాటడానికి సాధారణ మనుషులే చాలా ఇబ్బంది పడుతారు. అలాంటిది వికలాంగురాలు అయిన యాదమ్మ అనేక కష్టాలు పడి ఎలాగోలా రోడ్డు దాటింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని సురారంలో ఆదివారం జరిగింది. సూరారం ప్రాంతానికి చెందిన యాదమ్మకు రెండు కాళ్లు లేవు. దీంతో చక్రాలు అమర్చిన చెక్క సహాయంతో ఆమె రెండు చేతులు ఉపయోగించి ప్రయాణం చేస్తుంది. కాగా, ఆదివారం ఒక పక్క వర్షం, మరో పక్క రోడ్డుపై పెద్ద పెద్ద వాహనాలు, ఇవన్నీ చాలవన్నట్లు రోడ్డుకు అడ్డంగా ఉన్న డివైడర్.. వీటినన్నింటిని దాటుకొని యాదమ్మ ఎలాగోలా చివరికి రోడ్డు దాటింది. ప్రభుత్వం ఇప్పటికైనా వికలాంగుల గురించి ఆలోచించాలని అక్కడి వారు కోరారు. -
అబార్షన్ కోసం వచ్చిన గర్భిణి మృతి
శాలిబండ: అబార్షన్ కోసం వచ్చిన ఓ గర్భిణి మృతి చెందింది. ఈ సంఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం రాత్రి జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని మృతురాలి బంధువులు గురువారం అసెంబ్లీ ఎదుట ఆందోళనకు యత్నించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద కొండాపూర్‌కు చెందిన చెన్నయ్య భార్య యాదమ్మ(36) ఇటీవల గర్భం దాల్చింది. ఇప్పటికే ఆమెకు 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ వయసులో పిల్లల్ని కనడం కష్టమని భావించింది. అబార్షన్ చేయించుకునేందుకు గత నెల 22నపేట్లబురుజు ఆస్ప్రత్రికి వచ్చింది. ఎంటీపీ సమస్య ఉన్న కారణంగా ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని ఆమెకు అబార్షన్ చేయాల్సిందేనని వైద్యులు కూడా సూచించారు. తర్వాత చేయించుకుంటానని వెళ్లిన ఆమె బుధవారం ఆస్పత్రికి వచ్చింది. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఆపరేషన్ గదికి తీసుకువెళ్తుండగా యాదమ్మ మృతి చెందింది. కాగా ఆమె మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వస్తే తెలుస్తాయని ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ శ్రీదేవి తెలిపారు. సమాచారం అందుకున్న చార్మినార్ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వైద్యులు నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపిస్తూ మృతదేహంతో యాదమ్మ కుటుంబ సభ్యులు గురువారం అసెంబ్లీ ఎదుట ధర్నా చేసేందుకు యత్నించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. -
ఈ ఉపాధ్యాయులు మాకొద్దు
పూడూరు, న్యూస్‌లైన్: పూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహోదగ్రులయ్యారు. టీచర్లను పాఠశాల నుంచి పంపించివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన సంఘటన శనివారం పూడూరులో చోటుచేసుకుంది. స్థానిక సర్పంచ్ యాదమ్మ, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, విద్యార్థిని హాషంబీ తెలిపిన వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడల్లో భాగంగా ఆయా జట్లకు విద్యార్థులను ఎంపిక చేసే విషయంలో పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి, విద్యార్థిని హాషంబీల మధ్య గొడవ జరిగింది. దీంతో హాషంబీ ‘నేను క్రీడల్లో పాల్గొనబోను.. నా జట్టు విద్యార్థుల కూడా ఆడరు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ‘నీతో పాటు తోటి విద్యార్థులను కూడా ఆడకుండా చేస్తావా’ అంటూ పాఠశాల పీఈటీ దేవదాసు మందలించారు. ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి విద్యార్థిని హాషంబీపై చేయిచేసుకున్నారు. దీంతో హాషంబీ జరిగిన విషయాన్ని తన కుటుంబీకుల దృష్టికి తీసుకెళ్లింది. వారు పాఠశాలకు వచ్చి విద్యార్థినిని ఎందుకు కొట్టారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు గొడవ మొదలైంది. వీరిని సముదాయించేందుకు పాఠశాల హెచ్ఎం (ఎంఈఓ) రాంరెడ్డి ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. విషయం చినికిచినికి గాలివానగా మారింది. గ్రామస్తులు, విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గొడవపడుతున్నారనే సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని గొడవకు గల కారణాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను సముదాయించి ఆయన వెళ్లిపోయారు. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల ప్రవర్తన మొదట్నుంచీ అభ్యంతరకరంగానే.. జ్యోతిలక్ష్మి, దేవదాసులు పూడూరు పాఠశాలలో విధుల్లో చేరాకే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని విద్యార్థులు, గ్రామ సర్పంచ్ యాదమ్మ, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌లు పేర్కొన్నారు. అప్పటి నుంచి వారు పాఠాలు బోధించడం మానేసి కబుర్లు చెప్పుకొంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ముందే ఒకరికొకరు పుష్పాలు ఇచ్చుకోవడం వంటివి చేసేవారంటూ మండిపడ్డారు. ఇటువంటి చర్యలు పిల్లల ముందు చేయరాదని.. విద్యార్థులు కూడా లేనిపోనివి అలవాటు చేసుకుంటారంటూ గతంలోనే పాఠశాల హెచ్ఎం (ఎంఈఓ) రాంరెడ్డి, డిప్యూటి డీఈఓకు పాఠశాల ఎస్ఎసీ చైర్మన్ రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారిలో మార్పు తీసుకువస్తానని హెచ్ఎం నచ్చజెప్పడంతో అప్పట్లో శాంతించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు ఇలా విద్యార్థులపై దాడి చేయడం సరైంది కాదంటూ పెద్ద ఎత్తున నినదించారు. గ్రామ సర్పంచ్, పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లకు కనీస మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారంటూ వారు మండిపడ్డారు. పాఠశాలలో ఈ ఇద్దరి ఉపాధ్యాయుల ఆగడాలను అడ్డుకోడంలో విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహించి శనివారం నేరుగా డీఈఓ సోమిరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన డీఈఓ పాఠశాల హెచ్ఎం రాంరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. జరిగిన విషయం, ఉపాధ్యాయులు జ్యోతిలక్ష్మి, దేవదాసు ప్రవర్తనపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో ఎంఈఓ పాఠశాలకు చెందిన మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థులు, సర్పంచ్, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ల అభిప్రాయాలతో కూడిన నివేదిక తయారు చేసి డీఈఓకు పంపించారు. పూడూరు మండల కాంగ్రెస్ నాయకుడు రఘునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ యాదమ్మ, పాఠశాల చైర్మన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా డీఈఓ కలిసి తమ వాదనను వినిపించి వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరివెళ్లారు.