
బుల్లితెర కమెడియన్ యాదమ్మ రాజు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలు షార్లీ స్టెల్లాతో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ జరిగింది.
దీనికి సంబంధించిన ఫోటోలను యాదమ్మ రాజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో పలువురు బుల్లితెర నటీనటలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పటాస్ అనే కామెడీ షోతో పాపులర్ అయిన యాదమ్మ రాజు పలు టీవీ షోలతో తనదైన కామెడీతో అలరించాడు. ప్రియురాలు స్టెల్లాతో సైతం అతను పలు షోస్‌లో పాల్గొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment