డయాలసిస్ చికిత్స పొందుతున్న ఓ మహిళ ఉస్మానియా ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అఫ్జల్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్‌కు చెందిన యాదమ్మ(50) కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతోంది. ఈ మేరకు డయాలసిస్ చికిత్స కోసం రెండు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరింది. కాగా తాను త్వరలో చనిపోతాననే ఆందోళనతో మానసికంగా కుంగిపోయి మనస్థాపానికి గురై భవనంపై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన యాదమ్మ అక్కడికక్కడే చనిపోయింది.
ఉస్మానియాలో మహిళా రోగి ఆత్మహత్య
Published Wed, Jul 6 2016 7:24 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement