బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ కుమారుడు ప్రవీణ్ భారీ నగదుతో పట్టుబడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ పోలీసులు జెహ్నాబాద్ ఏయిర్ పోర్టులో తనిఖీలు చేస్తుండగా అతని నుంచి దాదాపు రూ. 4.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ శాసనసభకు అక్టోబర్ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రవీణ్ దగ్గర దొరికిన డబ్బుకు సంబంధించిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తన ఇంటి నిర్మాణపనుల కోసం కుటుంబసభ్యుల నుంచి ఆ డబ్బు తీసుకెళుతున్నానని పోలీసులకు చెప్పినట్టు సమాచారం.