పారిశుద్ధ్య కార్మికుడిపై నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు.
పారిశుద్ధ్య కార్మికుడిపై నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలో ఈ ఘటన చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుడు ప్రవీణ్‌ను సోమవారం ఉదయం నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతడి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.