కాళోజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన వర్సిటీ రిజిస్ట్రార్‌గా డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయన రిజిస్ట్రార్ పోస్టులో కొనసాగుతారని పేర్కొంది.
ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం వరంగల్‌లోని మహాత్మా గాంధీ స్మారక ఆస్పత్రిలో అనస్తీషియా విభాగం ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ పోస్టు ఆగస్టు 31న ఖాళీ అయింది.