సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో.. మరో మలుపు చోటు చేసుకుంది. తెర మీదకు మరో హైదరాబాదీ పేరు వచ్చింది.
లిక్కర్ స్కాంలో నిధుల మళ్లింపుపై ఈడీ ఛార్జిషీట్‌లో కీలకాంశాలు వెలుగు చూశాయి. దుబాయ్ కంపెనీతో పాటు ఫై అనే కంపెనీకి నిధులు మళ్లింపు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే ప్రముఖ సైంటిస్ట్ ప్రవీణ్ గొరకవి(33) పేరు తెర మీదకు వచ్చింది. సీఏ బుచ్చిబాబుకు ప్రవీణ్ గొరకవి సన్నిహితుడిగా తేలింది.
ఫై(Phi ) కంపెనీ ఫౌండర్‌గా ఉన్నాడు ప్రవీణ్ గొరకవి. దీంతో సైంటిస్ట్ అయిన ప్రవీణ్ పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉంటే.. ఈ కుంభకోణంలోని నిధుల్ని హవాలా రూపంలో ప్రవీణ్ కుమార్ కంపెనీకి మళ్లించినట్లు ఈడీ అభియోగం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. గతంలోనూ ప్రవీణ్ కుమార్‌కు కవాడిగూడలో ఉన్న ఇంటిపై ఈడీ దాడులు చేసింది. రూ.24 లక్షలు స్వాధీనం చేసుకుంది కూడా.
బాలమేధావిగా పేరు దక్కించుకున్న ప్రవీణ్.. పలు ఆవిష్కరణలు కూడా చేశాడు. గతంలో ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం నుంచి అవార్డు, అభినందనలు సైతం అందుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment