Bigg Boss 6 Telugu: Jabardasth Praveen Comments About Faima And Inaya Game - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఫైమాకు మూడు సార్లు ప్రపోజ్‌ చేశా: కమెడియన్‌ ప్రవీణ్‌

Published Sat, Nov 12 2022 3:56 PM | Last Updated on Sun, Nov 13 2022 5:42 PM

Bigg Boss 6 Telugu: Jabardasth Praveen About Faima Game - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో మరొకరిని బయటకు పంపించేందుకు సమయం ఆసన్నమైంది. అయితే ఈసారి ఒకరిని కాకుండా ఇద్దర్ని ఎలిమినేట్‌ చేయనున్నారు. ఈపాటికే షూటింగ్‌ ముగియడంతో బాలాదిత్య, మెరీనా హౌస్‌ నుంచి బయటకు వచ్చేశారని ప్రచారం జరుగుతోంది. నిజానికి గీతూ వెళ్లిపోగానే శ్రీసత్య, ఫైమాలను కూడా పంపించేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ శ్రీసత్య కెప్టెన్‌ కావడంతో నామినేషన్‌ నుంచి తప్పించుకుంది.

శ్రీసత్య తర్వాత ఫైమా కొత్తగా కెప్టెన్‌గా అవతరించడంతో ఆమె నెక్స్ట్‌ వీక్‌ నామినేషన్‌ నుంచి తప్పించుకోనుంది. ఇక ఈ వారం అంటారా? తనకన్నా వీక్‌ కంటెస్టెంట్‌ అయిన మెరీనా హౌస్‌లో ఉండనే ఉంది. మంచితనానికి నిలువెత్తు నిదర్శనంగా భావించే బాలాదిత్య గేమ్‌ బాగానే ఆడినప్పటికీ ఫ్యాన్‌ బేస్‌ లేదు. దీంతో ఫైమా ఎస్కేప్‌ అవగా బాలాదిత్య, మెరీనా ఎలిమినేట్‌ అయ్యారట!

తాజాగా ఫైమా ప్రియుడు, కమెడియన్‌ ప్రవీణ్‌ వారి ప్రేమ గురించి, ఆమె ఆట గురించి స్పందించాడు. 'ఫైమాకు మొదట నేనే ప్రపోజ్‌ చేశాను. మూడుసార్లు ప్రపోజ్‌ చేశాను, ఒప్పుకునేదాకా వదల్లేదు. బిగ్‌బాస్‌ విషయానికి వస్తే హౌస్‌లో ఫైమాది తొండి గేమ్‌ అంటున్నారు, ఆమెనే కాదు, చాలామంది తొండి గేమ్‌ ఆడుతున్నారు. ఇనయ గేమ్‌ నాకసలు నచ్చలేదు. ఫైమాను ఏమనలేక ఆమె మీద కోపాన్ని గేమ్‌లో చూపించింది. ఫైమాకు వెటకారం ఎక్కువైందంటున్నారు. బహుశా అది తన గేమ్‌ కావచ్చు. ఫైమాకు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌, ఓవరాక్షన్‌ ఎక్కువైందంటున్నారు, కానీ తన మాట తీరే అంత అని చెప్పుకొచ్చాడు ప్రవీణ్‌.

చదవండి: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌, ఆ ఇద్దరే అవుట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement