ఉపాధి కల్పిస్తున్న క్యాంటిన్ షెడ్ ను కూల్చేశారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.
జీవనోపాధి కల్పిస్తున్న క్యాంటిన్ షెడ్‌ను కూల్చివేశారనే మనోవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన శుక్రవారం మౌలాలీ ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. ప్రవీణ్ అనే వ్యక్తి మౌలాలీ ఇండస్ట్రియల్ ఏరియాలో షెడ్ ఏర్పాటు చేసుకుని కాంటీన్ నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఈస్థలాన్ని ఖాళీ చెయ్యాలని ఇండస్ట్రియల్ అధికారులు ఒత్తిడి చేశారు. అతడు షెడ్ ఖాలీ చేయడానికి నిరాకరించాడు. దీంతో అధికారులు శుక్రవారం షెడ్‌ను కూల్చివేశారు. మనస్తానపం చెందిన ప్రవీణ్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల సాయంతో అతడ్ని రక్షించారు.