స్పీడు పెంచిన ‘వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మీ’ టీం | Papa Atthili Papa Song From Laxmi Raai Where is The Venkatalakshmi | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 29 2019 1:16 PM | Last Updated on Tue, Jan 29 2019 1:16 PM

Papa Atthili Papa Song From Laxmi Raai Where is The Venkatalakshmi - Sakshi

ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. రాయ్‌ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తున్నాడు. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచారు చిత్రయూనిట్. తాజాగా రాయ్‌ లక్ష్మీపై తెరకెక్కించిన ఓ మాస్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

పాపా అత్తిలి పాప అంటూ సాగే ఈ పాటలో రాయ్‌ లక్ష్మీతో పాటు హస్య నటులు ప్రవీణ్, మదునందన్‌ కూడా ఆడి పాడారు. హరి గౌర సంగీతమందించిన ఈ పాటకు సురేష్‌ బానిశెట్టి సాహిత్యమందివ్వగా మంగ్లీ, హరిగౌర ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు కిశోర్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement