ఆదిలాబాద్: నిరుపేద కుటుంబం. కూలీ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొడుకులు ప్రయోజకులు కావాలని కష్టపడి చదివించారు. 2012లో పెద్ద కుమారుడు అడే ప్రవీణ్ పోలీసు ఉద్యోగానికి ఎంపిక కావడంతో స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. కానీవారి ఆనందం ఎక్కువకాలం నిలువలేదు.
విధి నిర్వహణలో కొడుకు ప్రాణాలు కో ల్పోవడం కుటుంబంలో విషాదం నింపింది. నా ర్నూర్ మండలం రాజులగూడకు చెందిన అడే అ నంత, నిర్మల దంపతులకు ఇద్దరు కుమారులు, కు మార్తె ఉంది. అనంత మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. పెద్ద కుమారుడు ప్రవీణ్(35) గ్రేహౌండ్స్ కమాండోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు.
విద్యుత్ తీగలు తగిలి..
మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లాల్సి ఉండగా ఆదివారం రాత్రి భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి కమాండో ప్రవీణ్ మృతి చెందాడు.
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మృతదేహాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని స్వగ్రామం రాజులగూడకు తీసుకువచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు నివాళులర్పించారు. ఎస్పీ గౌస్ ఆలం, 15వ బెటాలియన్ పోలీసు అధికారులు పాడే మోశారు. రాజులగూడ గ్రామం నుంచి మండల కేంద్రంలోని గాంధీచౌక్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో మాన్కాపూర్ శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు.
ప్రముఖుల నివాళులు..
ప్రవీణ్ కుటుంబీకులను మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఖుష్బూ పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అటవీ ప్రాంతంలో వేట కోసం విద్యుత్ తీగలు అమర్చిన వారిని పట్టుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు.
కార్యక్రమంలో 15వ బెటాలియన్ డీఎస్పీలు పీకేఎస్ రమేశ్, జి.రమేశ్, బి.రామ్, దయానంద్, ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ రెడ్డినాయక్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్‌నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావు, మాజీ సర్పంచ్ రాథోడ్ సావీందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment