టీడీపీ వేధింపులకువైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ బలి | YSRCP social media convenor is a victim of TDP harassment | Sakshi
Sakshi News home page

టీడీపీ వేధింపులకువైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ బలి

Published Thu, Jun 6 2024 4:39 AM | Last Updated on Thu, Jun 6 2024 11:50 AM

YSRCP social media convenor is a victim of TDP harassment

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యలమంచిలి ప్రవీణ్‌

పెదవేగి: టీడీపీ కార్యకర్తల వేధింపులు తట్టు­కో­లేక తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్‌­సీపీ సోషల్‌ మీడియా మండల కన్వీనర్‌ యలమంచిలి ప్రవీణ్‌ (30) ఆత్మహత్య చేసుకు­న్నాడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పంచాయతీ సూర్యా­­రావుపేటకి చెందిన ప్రవీణ్‌ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 

ఈ దుర్ఘటన మండలంలో విషాదం నింపింది. స్థానికులు తెలి­పిన వివ­రాల ప్రకారం.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజ­యా­నికి అహర్నిశలు శ్రమించాడ­న్న కక్షతో ఓట్ల లెక్కింపు రోజు (ఈనెల 4న) సాయంత్రం ప్రవీణ్‌ ఇంటి మీద తెలుగుదేశం కార్య­కర్తలు దాడిచేశారు. రాళ్లు, బీరు సీసాలు విసిరి, దుర్భాషలా­డు­తూ చంపేస్తామని బెదిరించారు. పెదవేగి పెట్రోల్‌ బంక్‌ వైపు వస్తే కొడతా­మని, బైక్, కారు తగల­బెట్టే­స్తామని హెచ్చరించారు. 

బుధ­­వారం ఉదయం ప్రవీణ్‌ విజయరాయి పెట్రో­ల్‌ బంక్‌కి వెళ్లగా.. బండిపై మాజీ ఎమ్మెల్యే అబ్బ­య్య­చౌదరి ఫొటోతో ఉన్న వైఎస్సార్‌సీపీ స్టిక్కర్‌ తీసే­వరకు బీభ­త్సం సృష్టించి దాడిచేశారు. టీడీపీ వారి బెదిరింపులకు భయ­పడి, వేధింపులు భరించలేక ప్రవీ­ణ్‌.. తన ఇంటి సమీపంలోని తోట­లో చెట్టుకు ఉరే­ç­Üుకుని ఆత్మ­హత్య చేసు­కున్నాడు. ప్రవీణ్‌ తల్లి­దండ్రులు యలమంచిలి ఝన్సీరాణి, ప్రకాశ­రావు, కుటుంబ­సభ్యులు కన్నీరు­మున్నీ­రుగా విలపిస్తున్నా­రు. 

దాడుల సంస్కృతి కొనసాగితే ఉరుకోం 
టీడీపీ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసు­కున్న ప్రవీణ్‌ భౌతికకాయానికి దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్‌ను బలి­తీసుకున్న టీడీపీ కార్యకర్తల అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. 

నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్య­కర్తలను టార్గెట్‌ చేస్తున్నారని, వారి ఇళ్ల మీదకు వెళ్లి భౌతికదాడులు చేస్తూ, వాహనాలు, ఇంట్లో వస్తు­వులు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల సంస్కృతి కొనసాగితే ఊరుకునేదిలేదని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా సంయమనం పాటించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement