వాందివేగీ మరో సంచలనం | Coco Vandeweghe Stuns Garbine Muguruza to Reach Semis | Sakshi
Sakshi News home page

వాందివేగీ మరో సంచలనం

Published Tue, Jan 24 2017 3:47 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

వాందివేగీ మరో సంచలనం

వాందివేగీ మరో సంచలనం

సిడ్నీ:  ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో అమెరికా క్రీడాకారిణి వాందివేగీ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. గత రెండు రోజుల క్రితం ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారణి ఎంజెలిక్ కెర్బర్ ను ఓడించి సంచలనం సృష్టించిన వాందివేగీ.. తాజాగా స్పెయిన్ కు చెందిన ఏడో సీడ్ గార్బెన్ ముగురుజాను ఓడించింది.

 

మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో 6-4, 6-0 తేడాతో ముగురుజాపై విజయం సాధించి సెమీస్లోకి ప్రవేశించింది. తొలి రెండు సెట్లను అవలీలగా గెలిచిన వాందివేగీ.. తాను కూడా ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో ఉన్నానంటూ మేటి క్రీడాకారిణులకు సవాల్ విసిరింది. మరో క్వార్టర్ ఫైనల్ పోరులో గెలిచిన వీనస్ విలియమ్స్ తో  వాందివేగీ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. వీనస్ విలియమ్స్ 6-4, 7-6(3)తేడాతో అనస్తసియాపై గెలిచి సెమీస్ కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement