వాందివేగీ మరో సంచలనం
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో అమెరికా క్రీడాకారిణి వాందివేగీ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. గత రెండు రోజుల క్రితం ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారణి ఎంజెలిక్ కెర్బర్ ను ఓడించి సంచలనం సృష్టించిన వాందివేగీ.. తాజాగా స్పెయిన్ కు చెందిన ఏడో సీడ్ గార్బెన్ ముగురుజాను ఓడించింది.
మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో 6-4, 6-0 తేడాతో ముగురుజాపై విజయం సాధించి సెమీస్లోకి ప్రవేశించింది. తొలి రెండు సెట్లను అవలీలగా గెలిచిన వాందివేగీ.. తాను కూడా ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో ఉన్నానంటూ మేటి క్రీడాకారిణులకు సవాల్ విసిరింది. మరో క్వార్టర్ ఫైనల్ పోరులో గెలిచిన వీనస్ విలియమ్స్ తో వాందివేగీ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. వీనస్ విలియమ్స్ 6-4, 7-6(3)తేడాతో అనస్తసియాపై గెలిచి సెమీస్ కు చేరింది.