ఆసియా కప్ జూనియర్ అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత జూనియర్ బృందం సత్తా చాటింది.
న్యూఢిల్లీ: ఆసియా కప్ జూనియర్ అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత జూనియర్ బృందం సత్తా చాటింది. దోహాలో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ 2–0తో ఉజ్బెకిస్తాన్‌పై గెలుపొంది టైటిల్‌ను దక్కించుకుంది. తొలి మ్యాచ్‌లో దేవ్ జావియా (భారత్) 6–2, 6–1తో అజీజ్‌పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో సందీప్ 6–3, 6–2తో బగ్రినోవ్‌స్కీని ఓడించాడు.
ఆర్యన్, జైశ్విన్, దేవ్, సందీప్‌లతో కూడిన భారత బృందం ఈ టోర్నీలో ఒక్కమ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరింది. లీగ్ మ్యాచ్‌ల్లో భారత్ 3–0తో హాంకాంగ్, ఖతార్, జోర్డాన్ జట్లను ఓడించింది. సెమీస్‌లో 2–0తో శ్రీలంకపై నెగ్గింది.