‘హ్యాట్రిక్‌’ విజయంతో సెమీస్‌లోకి భారత్‌ | India enters the semis with the Hatrick victory | Sakshi
Sakshi News home page

‘హ్యాట్రిక్‌’ విజయంతో సెమీస్‌లోకి భారత్‌

Published Thu, Sep 12 2024 3:52 AM | Last Updated on Thu, Sep 12 2024 3:56 AM

India enters the semis with the Hatrick victory

మలేసియాపై 8–1 గోల్స్‌ తేడాతో ఘనవిజయం

రాజ్‌కుమార్‌ పాల్‌ ‘హ్యాట్రిక్‌’  

హులున్‌బుయిర్‌ (చైనా): ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ పురుషుల హాకీ టోరీ్నలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గత ఏడాది రన్నరప్‌ మలేసియా జట్టుతో బుధవారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం 8–1 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. మలేసియా జట్టుపై భారత్‌కిది అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో భారత జట్టు మరో రెండు లీగ్‌ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే తొమ్మిది పాయింట్లతో సెమీఫైనల్‌ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. 

భారత్‌ తరపున రాజ్‌కుమార్‌ పాల్‌ (3వ, 25వ, 33వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్‌’ సాధించాడు. అరిజీత్‌ సింగ్‌ హుండల్‌ (6వ, 39వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... జుగ్‌రాజ్‌ సింగ్‌ (7వ ని.లో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (22వ ని.లో), ఉత్తమ్‌ సింగ్‌ (40వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. మలేసియా జట్టుకు అఖీముల్లా అనూర్‌ (34వ ని.లో) ఏకైక గోల్‌ అందజేశాడు. గత ఏడాది ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు జట్లు చివరిసారి ముఖాముఖిగా పోటీపడ్డాయి. 

నాటి ఫైనల్లో అర్ధభాగం ముగిసేసరికి 1–3 గోల్స్‌తో వెనుకబడ్డ భారత్‌ ఆ తర్వాత తేరుకొని చివరకు 4–3 గోల్స్‌ తేడాతో నెగ్గి విజేతగా అవతరించింది. ఈసారి మాత్రం మలేసియాపై ఆరంభం నుంచే భారత్‌ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్‌ మొదలైన మూడో నిమిషంలోనే రాజ్‌కుమార్‌ మలేసియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్‌ చేశాడు. ఆ తర్వాత నాలుగు నిమిషాల వ్యవధిలో భారత్‌ మరో రెండు గోల్స్‌ చేసి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

ఆ తర్వాత కూడా భారత్‌ తమ జోరు కొనసాగించింది. ఇతర లీగ్‌ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ 2–1తో జపాన్‌పై, కొరియా 3–2తో చైనాపై గెలిచాయి. నేడు జరిగే నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో కొరియాతో భారత్‌ ఆడతుంది. హులున్‌బుయిర్‌ (చైనా): ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ పురుషుల హాకీ టోరీ్నలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గత ఏడాది రన్నరప్‌ మలేసియా జట్టుతో బుధవారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం 8–1 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. 

మలేసియా జట్టుపై భారత్‌కిది అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో భారత జట్టు మరో రెండు లీగ్‌ మ్యాచ్‌లు మిగిలి ఉండగానే తొమ్మిది పాయింట్లతో సెమీఫైనల్‌ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. భారత్‌ తరపున రాజ్‌కుమార్‌ పాల్‌ (3వ, 25వ, 33వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్‌’ సాధించాడు. అరిజీత్‌ సింగ్‌ హుండల్‌ (6వ, 39వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... జుగ్‌రాజ్‌ సింగ్‌ (7వ ని.లో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (22వ ని.లో), ఉత్తమ్‌ సింగ్‌ (40వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. మలేసియా జట్టుకు అఖీముల్లా అనూర్‌ (34వ ని.లో) ఏకైక గోల్‌ అందజేశాడు. 

గత ఏడాది ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు జట్లు చివరిసారి ముఖాముఖిగా పోటీపడ్డాయి. నాటి ఫైనల్లో అర్ధభాగం ముగిసేసరికి 1–3 గోల్స్‌తో వెనుకబడ్డ భారత్‌ ఆ తర్వాత తేరుకొని చివరకు 4–3 గోల్స్‌ తేడాతో నెగ్గి విజేతగా అవతరించింది. ఈసారి మాత్రం మలేసియాపై ఆరంభం నుంచే భారత్‌ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్‌ మొదలైన మూడో నిమిషంలోనే రాజ్‌కుమార్‌ మలేసియా డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్‌ చేశాడు. 

ఆ తర్వాత నాలుగు నిమిషాల వ్యవధిలో భారత్‌ మరో రెండు గోల్స్‌ చేసి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా భారత్‌ తమ జోరు కొనసాగించింది. ఇతర లీగ్‌ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ 2–1తో జపాన్‌పై, కొరియా 3–2తో చైనాపై గెలిచాయి. నేడు జరిగే నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో కొరియాతో భారత్‌ ఆడతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement