
సెమీస్‌లో హైదరాబాద్, రంగారెడ్డి
అంతర్ జిల్లా స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నీ
ఎల్బీ స్టేడియం: తెలంగాణ అంతర్ జిల్లా స్కూల్ అండర్-14 బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్, రంగారెడ్డి బాలబాలికల జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. బాలుర విభాగంలో వరంగల్, ఖమ్మం జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. బాలికల విభాగంలో వరంగల్, నిజామాబాద్ జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లోని జరుగుతున్న ఈ పోటీల్లో శనివారం హైదరాబాద్ 19-18తో వరంగల్‌పై విజయం సాధించింది, హైదరాబాద్ జట్టులో కపిల్, శంకర్ చక్కటి పోరాటపటిమతో జట్టుకు విజయాన్ని అందించారు.
బాలికల లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 6-1తో మహబూబ్‌నగర్‌పై గెలిచింది. ఆదివారం జరిగే బాలుర సెమీఫైనల్లో హైదరాబాద్‌తో ఖమ్మం, వరంగల్‌తో రంగారెడ్డి జట్టు తలపడతాయి. బాలికల విభాగం సెమీఫైనల్లో హైదరాబాద్‌తో వరంగల్, రంగారెడ్డి జిల్లాతో నిజామాబాద్ ఢీకొంటాయి. శనివారం జరిగిన లీగ్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
బాలుర లీగ్ ఫలితాలు: కరీంనగర్ 23-10తో నిజామాబాద్‌పై, హైదరాబాద్ 31-1తో నల్లగొండపై, ఖమ్మం 29-4తో ఆదిలాబాద్‌పై, వరంగల్ 26-4తో మహబూబ్‌నగర్‌పై, రంగారెడ్డి 40-11తో ఖమ్మంపై, మహబూబ్‌నగర్ 22-4తో మెదక్‌పై, ఆదిలాబాద్ 13-11తో నిజామాబాద్‌పై, ఖమ్మం 31-21తో కరీంనగర్‌పై, హైదరాబాద్ 16-2తో మెదక్‌పై గెలిచాయి.
బాలికల లీగ్ ఫలితాలు: హైదరాబాద్ 23-1లో ఆదిలాబాద్‌పై, రంగారెడ్డి 28-2తో కరీంనగర్‌పై, నిజామాబాద్ 14-4తో ఖమ్మంపై, రంగారెడ్డి 22-2తో మెదక్‌పై, నిజామాబాద్ 19-4తో ఆదిలాబాద్‌పై, రంగారెడ్డి 17-6తో వరంగల్‌పై, హైదరాబాద్ 10-0తో ఖమ్మంపై గెలుపొందాయి.