
న్యూఢిల్లీ: కెమిస్ట్రీ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (56 కే జీలు) సెమీఫైనల్‌కు చేరాడు. శుక్రవారం జర్మనీలో జరిగిన క్వార్టర్స్‌లో హుసాముద్దీన్ 5–0తో అల్వాడి (జోర్డాన్)పై విజయం సాధించాడు.
హుసాముద్దీన్‌తో పాటు మదన్ (56 కేజీలు), నరేందర్ (ప్లస్ 91 కేజీలు)లు కూడా సెమీస్‌కు చేరారు. మరోవైపు ఉలాన్‌బాటర్ కప్ బాక్సింగ్ టోర్నీలో శివ థాపా (60 కేజీలు), మన్‌దీప్ (69 కేజీలు), వాన్‌లింపుయా (75 కేజీలు), ఇతాష్ ఖాన్ (56 కేజీలు) సెమీస్‌కు అర్హత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment