పసిడి పోరుకు శ్యామ్‌ | Shyam, Rohit enter medal rounds at Thailand boxing tourney | Sakshi
Sakshi News home page

పసిడి పోరుకు శ్యామ్‌

Published Fri, Apr 7 2017 12:43 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

పసిడి పోరుకు శ్యామ్‌

పసిడి పోరుకు శ్యామ్‌

సెమీస్‌లో సంచలన విజయం

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ కాకర శ్యామ్‌ కుమార్‌ అదరగొట్టాడు. బ్యాంకాక్‌లో గురువారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో 49 కేజీల విభాగంలో తలపడిన శ్యామ్‌... గ్యాంకుయాగ్‌ గ్యాన్‌ ఎర్డ్‌నె (మంగోలియా)పై సంచలన విజయం సాధించి తుదిపోరుకు అర్హత సాధించాడు. 2015లో ఈ ఈవెంట్‌లో స్వర్ణాన్ని సాధించిన శ్యామ్‌ మరోసారి పసిడి పోరుకు సిద్ధమయ్యాడు.

ఫైనల్లో ఒలింపిక్‌ చాంపియన్‌ హసన్‌బోయ్‌ డస్మటోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) తో అమీతుమీ తేల్చుకుంటాడు. మరో సెమీస్‌ మ్యాచ్‌లో రోహిత్‌ టోకస్‌ (64 కేజీ)... అబ్దుర్‌ రైమోవ్‌ ఎల్నూర్‌ (ఉజ్బెకిస్థాన్‌) చేతిలో పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 2015లో కూడా రోహిత్‌ కాంస్యం సాధించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement