న్యూఢిల్లీ: జూనియర్ మహిళల ఆసియా కప్‌లో పాల్గొననున్న భారత అండర్–19 జట్టులో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతి, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి షబ్నమ్ చోటు దక్కించుకున్నారు. కౌలాలాంపూర్ వేదికగా ఈ నెల 15 నుంచి 22 వరకు జూనియర్ మహిళల ఆసియా కప్ జరగనుంది.
సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. నికీ ప్రసాద్ భారత జట్టుకు సారథ్యం వహించనుండగా... సనికా చాల్కె వైస్ కెపె్టన్‌గా వ్యవహరించనుంది. అండర్–19 ప్రపంచకప్‌లో ఆడిన అనుభవం ఉన్న త్రిషతో పాటు మహిళల ఐపీఎల్లో గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న షబ్నమ్ ఇందులో చోటు దక్కించుకున్నారు.
నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్లను ప్రకటించగా... అందులో తెలంగాణ అమ్మాయి గుగులోత్ కావ్యశ్రీ కూడా ఉంది. ఈ టోరీ్నలో పాకిస్తాన్, నేపాల్‌తో కలిసి భారత్ జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి పోటీ పడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. టోర్నీ ఆరంభ పోరులో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడుతుంది.
గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సూపర్–4కు అర్హత సాధించనున్నాయి. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ నెల 22 జరగనున్న ఫైనల్లో తలపడనున్నాయి.
భారత జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సనికా చాల్కె (వైస్ కెపె్టన్), గొంగడి త్రిష, కమలిని, భావిక అహిరె, ఈశ్వరి అవాసరె, మిథిలా వినోద్, జోషిత, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, అనందిత కిషోర్, షబ్నమ్, నందన. స్టాండ్‌బైలు: హర్లీ గాలా, హ్యాపీ కుమారి, గుగులోత్ కావ్యశ్రీ, గాయత్రి.
Comments
Please login to add a commentAdd a comment