మహిళల జట్టుపై బీసీసీఐ ప్రకటన
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు శనివారం నుంచి బ్యాంకాక్‌లో జరిగే ఆసియా కప్‌లో పాల్గొంటుందని బీసీసీఐ ప్రకటించింది. అరుుతే ఇదే టోర్నీలో బరిలో ఉన్న పాకిస్తాన్ జట్టుతో తాము ఆడేదీ.. లేనిదీ బోర్డు ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఆదివారం భారత్ తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. షెడ్యూల్ ప్రకారం 29న పాకిస్తాన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘ఇప్పటికై తే భారత జట్టు ఆసియా కప్‌లో ఆడుతుంది.
అరుుతే పాక్‌తో ఆడే విషయం మాత్రం ఏమీ చెప్పలేను’ అని బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పష్టం చేశారు. ఆసియా కప్‌లో భారత్‌తో పాటు నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్ జట్టు పాల్గొంటున్నారుు. ఐసీసీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు ఆడనందుకు భారత మహిళా జట్టుపై ఐసీసీ ఆరు పారుుంట్ల కోత విధించిన విషయం తెలిసిందే.