ఆసీస్‌తో ఐదో టీ20.. టీమిండియా ముందు కొండంత లక్ష్యం | INDW VS AUSW 5th T20: Australia Set Huge Target To Team India | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో ఐదో టీ20.. టీమిండియా ముందు కొండంత లక్ష్యం

Published Tue, Dec 20 2022 8:46 PM | Last Updated on Tue, Dec 20 2022 8:46 PM

INDW VS AUSW 5th T20: Australia Set Huge Target To Team India - Sakshi

INDW VS AUSW 5th T20: భారత మహిళా క్రికెట్‌ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా.. నామమాత్రంగా ఇవాళ (డిసెంబర్‌ 20) జరుగుతున్న ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడినప్పటికీ టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌.. 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అయితే మిడిలార్డర్‌ బ్యాటర్లు ఆష్లే గార్డ్‌నర్‌ (32 బంతుల్లో 66 నాటౌట్‌; 11 ఫోర్లు, సిక్స్‌), గ్రేస్‌ హారిస్‌ (35 బంతుల్లో 64 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్స్‌) మెరుపు అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు బెత్‌ మూనీ (2), లిచ్‌ఫీల్డ్‌ (11), కెప్టెన్‌ తహీలా మెక్‌గ్రాత్‌ (26), పెర్రీ (18) తొందరగానే ఔటైనా గార్డ్‌నర్‌-హారిస్‌ జోడీ ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో అజేయమైన 129 పరుగులు జోడించి, టీమిండియాకు భారీ టార్గెట్‌ నిర్ధేశించడంలో కీలకంగా వ్యవహరించారు.

భారత బౌలర్లలో అంజలీ సర్వానీ, దీప్తి శర్మ, షఫాలీ వర్మ, దేవిక వైద్య తలో వికెట్‌ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి టీ20లో ఆసీస్‌, ఆతర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్‌.. మూడు, నాలుగు టీ20ల్లో ఆసీస్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement