
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024 సన్నాహాల్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో భారత జట్టు అదరగొట్టింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్ధులను భారత్ చిత్తు చేసింది. మంగళవారం దుబాయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ (35 నాటౌట్; 2 ఫోర్లు), రిచా ఘోష్ (36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్ (30; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబొగా ఖాక 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో లారా వోల్వార్డ్ట్(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో ఆశా శోభనా రెండు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, శ్రేయంకా పాటిల్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ప్రధాన టోర్నీ ఆక్టోబర్3 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం..