ఆస్ట్రేలియాలో భారత మహిళా జట్టు బౌలర్ల వైఫల్యం కొనసాగుతోంది. పెర్త్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో సైతం భారత బౌలర్లు తీవ్ర నిరాశపరిచారు. మన బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఉతికారేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఆసీస్ బ్యాటర్లలో అన్నాబెల్ సదర్లాండ్(95 బంతుల్లో 110, 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. గార్డనర్(50), కెప్టెన్ మెక్‌గ్రాత్(56 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో ఒక్క అరుంధతి రెడ్డి మినహా మిగతా అందరూ తీవ్ర నిరాశపరిచారు.
అరుంధతి తన 10 ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. కాగా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఘోర ఓటమి చవిచూసిన భారత జట్టు 2-0 తేడాతో సిరీస్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. కనీసం ఆఖరి వన్డేలోనైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని హర్మాన్ సేన భావిస్తోంది. ఇప్పుడు ఆ భారమంతా భారత బ్యాటర్లపైనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment