CWG 2022 Aus W Vs Ind W Final: Australia Beats India By 9 Runs, Check Score Details - Sakshi
Sakshi News home page

Aus W Vs Ind W: కామన్‌వెల్త్‌ గేమ్స్‌ మహిళల క్రికెట్‌లో రజతంతో సరిపెట్టుకున్న టీమిండియా

Published Mon, Aug 8 2022 7:25 AM | Last Updated on Mon, Aug 8 2022 8:06 AM

CWG 2022 Womens Cricket Final: Australia Beats India By 9 Runs In Thriller, India Settles For Silver - Sakshi

CWG 2022 Womens Cricket Final: కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఈసారి ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్‌లో భారత జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ (61; 8 ఫోర్లు), మెగ్‌ లానింగ్‌ (36; 5 ఫోర్లు, 1 సిక్స్‌), అష్లే గార్డ్‌నెర్‌ (25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.  ]

భారత బౌలర్లలో రేణుక సింగ్, స్నేహ్‌ రాణా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత మహిళల జట్టు 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌  (65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడినా ఫలితం లేకపోయింది. మహిళల క్రికెట్‌లో రజతంతో భారత పతకాల సంఖ్య 52కు చేరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement